Saturday, July 24, 2010

Brinjal currys

వంకాయ కూర్మ 
కావలసిన పదార్ధాలు:
పొట్టి వంకాయలు-1/4  కగ్
పల్లీలు-50  గ్రాములు 
నువ్వులు- 2 టీ స్పూన్లు 
ధనియాలు - 2 టీ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్టు - తగినంత
కారం - సరిపడా 
ఉప్పు - తగినంత
ఉల్లిపాయలు - 100 గ్రాములు
ఎండు  కొబ్బరి తురుము - 2 టీ స్పూన్లు
చింతపండు - నిమ్మకాయంత 
పసుపు - తగినంత 
గ్రేవీ కోసం :
ఎండు కొబ్బరి తురుము , పల్లిల పొడి , అల్లం వెల్లులి పేస్టు , చింతపండు , కారం , పసుపు , ఉప్పు, ఉల్లిపాయలు , కలిపి మిక్సి లో  వేసి గ్రావి తయారుచేసుకోవాలి.
పోపు కోసం :
ఎండు మిర్చి-5
ఆవాలు - ఒక టీ స్పూన్ 
మినపప్పు - ఒక టీ స్పూన్ 
పచ్చి సెనగ పప్పు - ఒక టీ స్పూన్ 
నూనె  కొద్దిగా
తయారి:
వంకాయలను నాలుగు బాగాలుగా గాట్లు పెట్టి నీళ్ళలో వెయ్యాలి . పల్లీలు , నువ్వులను విడి విడి గా  వేయించి పొడి చేసుకోవాలి.(రెండు కలిపి వేయించితే నువ్వులు మాడిపోయే అవకాసం వుంది) గాటు పెట్టిన వంకాయలను పల్లి , నువ్వుల పొడితో నింపాలి . స్టవ్ పై బాణలి పెట్టి , పోపు దినుసులు , ఉల్లిపాయలు వేసి కాసేపు వేయించిన తరువాత స్టఫ్ చేసిన వంకాయలు వేయాలి . అయిదు నిమిషాలు బాగా వేగిన తరువాత గ్రేవి , కొద్దిగా నీరు పోసి ఉడికించాలి బాగా వుడికినట్టు అనిపించాక దింపేయాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చపాతి తో గాని రైస్ తో గాని సర్వే చేసుకుంటే బాగుంటుంది.

2 comments:

  1. i tried this yaar........ its very yummy.......kekaaaaaaaaaa......:-)

    ReplyDelete
  2. Thanq ruchi............... for trying

    ReplyDelete