చేపల పులుసు కి కావలసిన పదార్ధాలు:
| Chinthapandu |
- చేప ముక్కలు
- ఉల్లి - ౩
- పచ్చి మిర్చి -2
- టొమాటో - ౧
- కొతిమీర (గార్నిష్ కోసం
- కరివేపాకు -2 రెబ్బలు
- దాల్చిన చెక్క , లవంగాలు , ఏలకులు , పువ్వు
- అల్లం వెల్లులి పేస్టు - 2 టేబుల్ స్పూన్స్
- జీర - 1/2 tea spoon
- ఉప్పు , కారం సరిపడేంత
- చింతపండు కావలసినంత ( నీటిలో వేసి నానాబెట్టాలి)
- నూనె - 4 టేబుల్ స్పూన్స్
- ముందుగా చేపలకు కొద్దిగా ఉప్పు కారం రాసి నూనె లో సగం వేగినంత వరకు వేపి తీసి పక్కన పెట్టుకోవాలి.
| గ్రావి ingrediants |
ఉల్లిపాయలు , పచ్చిమిర్చి , టొమాటో , గరం మసాల సామాన్లు, అల్లం వెల్లులి పేస్టు , జీర మొత్తం అని కూడా మిక్షి లో వేసి పేస్టు చేసుకోవాలి.
| గ్రావి fry |
పులుసు తయారి విధానం:
ముందుగా గిన్నె లో నూనె వేసి వేడి చెయ్యాలి. నూనె వేడెక్కినాక పేస్టు చేసుకున్న గ్రావి మిశ్రమం అంత వేసి కొద్దిగా నీలు వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగానివాలి అంటే నూనె తెలిపోయినంత వరకు వేగానివాలి . దీనికి సరిపడేంత ఉప్పు కారం జత చేయాలి . ఆ తరువాత మనకు కావలసినంత చింతపండు రసం తీసుకొని వేగుతున్న గ్రావి లో పోయ్యాల్లి చిన్న మంటలో పెట్టి వుడకనివాలి . ఉడుకుతున్న గ్రావి లో చేప ముక్కలు వేసి మూత పెట్టి మరి కాసేపు వుడకనివ్వాలి. చివరగా కరివేపాకు కోతిమీరతో గార్నిష్ చేసుకోవాలి.
| శీలవతీ చేపల పులుసు |
- రైస్ లో కలుపుకొని తింటే చాల బాగుంటుంది.
- చెరువు చేపలకైతే ఈ విధంగా చేసుకుంటే రుచి గా వుంటుంది
No comments:
Post a Comment