కావలసిన పదార్ధాలు:
పొట్టి వంకాయలు-1/4 కగ్
పల్లీలు-50 గ్రాములు
నువ్వులు- 2 టీ స్పూన్లు
ధనియాలు - 2 టీ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్టు - తగినంత
కారం - సరిపడా
ఉప్పు - తగినంత
ఉల్లిపాయలు - 100 గ్రాములు
ఎండు కొబ్బరి తురుము - 2 టీ స్పూన్లు
చింతపండు - నిమ్మకాయంత
పసుపు - తగినంత
గ్రేవీ కోసం :
ఎండు కొబ్బరి తురుము , పల్లిల పొడి , అల్లం వెల్లులి పేస్టు , చింతపండు , కారం , పసుపు , ఉప్పు, ఉల్లిపాయలు , కలిపి మిక్సి లో వేసి గ్రావి తయారుచేసుకోవాలి.
పోపు కోసం :
ఎండు మిర్చి-5 ఆవాలు - ఒక టీ స్పూన్
మినపప్పు - ఒక టీ స్పూన్
పచ్చి సెనగ పప్పు - ఒక టీ స్పూన్
నూనె కొద్దిగా
తయారి:
వంకాయలను నాలుగు బాగాలుగా గాట్లు పెట్టి నీళ్ళలో వెయ్యాలి . పల్లీలు , నువ్వులను విడి విడి గా వేయించి పొడి చేసుకోవాలి.(రెండు కలిపి వేయించితే నువ్వులు మాడిపోయే అవకాసం వుంది) గాటు పెట్టిన వంకాయలను పల్లి , నువ్వుల పొడితో నింపాలి . స్టవ్ పై బాణలి పెట్టి , పోపు దినుసులు , ఉల్లిపాయలు వేసి కాసేపు వేయించిన తరువాత స్టఫ్ చేసిన వంకాయలు వేయాలి . అయిదు నిమిషాలు బాగా వేగిన తరువాత గ్రేవి , కొద్దిగా నీరు పోసి ఉడికించాలి బాగా వుడికినట్టు అనిపించాక దింపేయాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చపాతి తో గాని రైస్ తో గాని సర్వే చేసుకుంటే బాగుంటుంది.

i tried this yaar........ its very yummy.......kekaaaaaaaaaa......:-)
ReplyDeleteThanq ruchi............... for trying
ReplyDelete