Thursday, October 28, 2010

Fish curry

చేపల పులుసు కి కావలసిన పదార్ధాలు:



Chinthapandu
  • చేప ముక్కలు 
  • ఉల్లి - ౩
  • పచ్చి మిర్చి -2
  • టొమాటో - ౧
  • కొతిమీర  (గార్నిష్ కోసం
  • కరివేపాకు -2 రెబ్బలు
  • దాల్చిన చెక్క , లవంగాలు , ఏలకులు , పువ్వు
  • అల్లం వెల్లులి పేస్టు - 2 టేబుల్ స్పూన్స్
  • జీర - 1/2 tea spoon
  • ఉప్పు  , కారం  సరిపడేంత 
  • చింతపండు కావలసినంత ( నీటిలో వేసి నానాబెట్టాలి)
  • నూనె - 4 టేబుల్ స్పూన్స్  
  • ముందుగా చేపలకు కొద్దిగా ఉప్పు కారం రాసి నూనె లో సగం వేగినంత వరకు వేపి తీసి పక్కన పెట్టుకోవాలి. 

గ్రావి తయారు చేయు విధానం :
గ్రావి ingrediants
    ఉల్లిపాయలు , పచ్చిమిర్చి , టొమాటో , గరం మసాల సామాన్లు, అల్లం వెల్లులి పేస్టు , జీర మొత్తం అని కూడా మిక్షి లో వేసి పేస్టు చేసుకోవాలి.

గ్రావి fry
పులుసు తయారి విధానం:
  ముందుగా గిన్నె లో నూనె వేసి వేడి చెయ్యాలి. నూనె వేడెక్కినాక పేస్టు చేసుకున్న గ్రావి మిశ్రమం అంత వేసి కొద్దిగా నీలు వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగానివాలి అంటే నూనె తెలిపోయినంత వరకు వేగానివాలి .  దీనికి సరిపడేంత ఉప్పు కారం జత చేయాలి . ఆ తరువాత మనకు కావలసినంత చింతపండు రసం తీసుకొని వేగుతున్న గ్రావి లో పోయ్యాల్లి  చిన్న మంటలో పెట్టి వుడకనివాలి .  ఉడుకుతున్న గ్రావి లో చేప ముక్కలు వేసి మూత పెట్టి మరి కాసేపు వుడకనివ్వాలి. చివరగా కరివేపాకు కోతిమీరతో గార్నిష్ చేసుకోవాలి.

శీలవతీ చేపల పులుసు 

  • రైస్ లో కలుపుకొని తింటే చాల బాగుంటుంది.
  • చెరువు చేపలకైతే ఈ విధంగా చేసుకుంటే రుచి గా వుంటుంది

Saturday, July 24, 2010

Brinjal currys

వంకాయ కూర్మ 
కావలసిన పదార్ధాలు:
పొట్టి వంకాయలు-1/4  కగ్
పల్లీలు-50  గ్రాములు 
నువ్వులు- 2 టీ స్పూన్లు 
ధనియాలు - 2 టీ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్టు - తగినంత
కారం - సరిపడా 
ఉప్పు - తగినంత
ఉల్లిపాయలు - 100 గ్రాములు
ఎండు  కొబ్బరి తురుము - 2 టీ స్పూన్లు
చింతపండు - నిమ్మకాయంత 
పసుపు - తగినంత 
గ్రేవీ కోసం :
ఎండు కొబ్బరి తురుము , పల్లిల పొడి , అల్లం వెల్లులి పేస్టు , చింతపండు , కారం , పసుపు , ఉప్పు, ఉల్లిపాయలు , కలిపి మిక్సి లో  వేసి గ్రావి తయారుచేసుకోవాలి.
పోపు కోసం :
ఎండు మిర్చి-5
ఆవాలు - ఒక టీ స్పూన్ 
మినపప్పు - ఒక టీ స్పూన్ 
పచ్చి సెనగ పప్పు - ఒక టీ స్పూన్ 
నూనె  కొద్దిగా
తయారి:
వంకాయలను నాలుగు బాగాలుగా గాట్లు పెట్టి నీళ్ళలో వెయ్యాలి . పల్లీలు , నువ్వులను విడి విడి గా  వేయించి పొడి చేసుకోవాలి.(రెండు కలిపి వేయించితే నువ్వులు మాడిపోయే అవకాసం వుంది) గాటు పెట్టిన వంకాయలను పల్లి , నువ్వుల పొడితో నింపాలి . స్టవ్ పై బాణలి పెట్టి , పోపు దినుసులు , ఉల్లిపాయలు వేసి కాసేపు వేయించిన తరువాత స్టఫ్ చేసిన వంకాయలు వేయాలి . అయిదు నిమిషాలు బాగా వేగిన తరువాత గ్రేవి , కొద్దిగా నీరు పోసి ఉడికించాలి బాగా వుడికినట్టు అనిపించాక దింపేయాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చపాతి తో గాని రైస్ తో గాని సర్వే చేసుకుంటే బాగుంటుంది.

Wednesday, July 21, 2010

sweets


RASAGULLA


కావలసిన పదార్థాలు :
పాలు... ఒక లీటరు
డాల్డా... 200 గ్రాములు
పంచదార... 400 గ్రాములు
యాలకులు... నాలుగు

తయారీ విధానం :
ముందుగా పాలలో కాస్తంత మజ్జిగ చుక్క వేసి స్టవ్‌పై పెట్టి వేడి చేస్తే విరిగిపోతాయి. తరువాత విరిగిన పాలని మళ్ళీ స్టవ్‌మీద పెట్టి సన్నని మంటమీద పెడితే అందులోని నీరంతా ఆవిరైపోయి, మిగతాది పొడిపొడిగా తయారవుతుంది.
పొడిగా అయిన పదార్థాన్ని తడి చేతితో బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. తరువాత బాణలిలో డాల్డాపోసి మరిగిన తరువాత ఈ ఉండలను వేసి వేగనివ్వాలి. వేగుతుండగా మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండాలి. ఉండలన్నీ వేగిన తరువాత అప్పటికే తయారు చేసుకుని ఉన్న పంచదార పాకంలో వేయాలి. ఆ తరువాత యాలకులపొడిని అందులో చల్లి ఓ గంటసేపు నానబెడితే పాలతో రసగుల్లా తయారయినట్లే. మీరు కూడా ప్రయత్నిస్తారు కదూ...!
Note:



  • రసగుల్లా మృదువుగా రావాలంటే విరిగిన పాలతో వచ్చిన పాల పొడి ని ఎంత వీలైతే అంత సేపు కలపాలి అప్పుడే రసగుల్లా మృదువుగా తయారౌతుంది .
  • ఒక రసగుల్లా లో 5 గ్రాముల కొవ్వు వుంది  125 కాలోరిలను విడుదల చేస్తుంది. 
అయితే 20 నిమిషాలు  పాటు  మీరు   ఏదైనా   పని  లేదా  డాన్సు  చేసినట్టైతే కొవ్వు తగ్గుముకం పడుతుంది.